టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పదేళ్లకు పైగా శిక్ష పడే ఐపిసి సెక్షన్ 467 వర్తించదని హైకోర్టు కీలక తీర్పుని వెలువరించింది. జలవనురుల శాఖ అధికారులు ఇచ్చిన ఎన్వోసీ విలువైన పత్రాల నిర్వచనం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. సిఆర్పిసి లోని 41 ఏ కింద అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని తీర్పునిచ్చింది.
సిఐడి విచారణ జరుపుకోవచ్చని హైకోర్టు సూచించింది. ఆయనపై నమోదైన కేసును కొట్టివేయాలని చెప్పి ఐపిసి సెక్షన్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చి ఆయనని విచారణకి పిలిపించి మాట్లాడాలి అని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ స్థలం ఆక్రమణ కేసును కొట్టివేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. 41 ఏ నోటీసు ఇవ్వాలని సంబంధిత విచారణ సంస్థకు సూచించింది. అంతేకాకుండా అయ్యన్నపాత్రుడిని, అతని తనయుడు రాజేష్ ని సి.ఐ.డి విచారించుకోవచ్చు అనిలుపుతూ.. విచారణకు అయ్యన్నపాత్రుడు సహకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.