అల్లు శిరీష్ హీరోగా,అను ఇమ్యాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఊర్వశివో రాక్షశివో సినిమాకు గత వారం విడుదలైన సినిమాలలో మంచి టాక్ వచ్చింది అయితే సినిమాలో బెడ్ రూం సీన్స్,లిప్ లాక్ సీన్ లు వుండటం ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారాయి. దీంతో ఈ సినిమా యూత్ ను థియేటర్లు కు రప్పించింది.ఈ మూవీ ప్రస్తుతం ఊహించిన దానికి మించి మంచి వసూళ్లని రాబడుతోంది.
తాజాగా ఈ చిత్రం నటించిన అను ఇమ్యాన్యుయేల్ తెలుగులో అల్లు శిరీష్ సరసన నటించడంతో ఆయనతో ఎఫైర్ ఉన్నట్లు ప్రచారం చేశారని. దీన్ని చూసి మా ఇంట్లో అందరూ చాలా బాధపడ్డారు అని తెలిపింది.ఇలాంటి వాటిని తాను అస్సలు పట్టించుకోనని, అసలు ఏమి లేకుండా ఇలా ప్రచారం చేస్తే ఎలా అంటూ మండి పడింది. అసలు షూటింగ్‌కు ముందు అల్లు శిరీష్ గురించి తనకు తెలియదని , సినిమా షూటింగ్ లోనే తాను అల్లు శిరీష్‌ను కలిశానని చెప్పింది.
ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి హోటల్ కి వెళ్ళినా కూడా రకరకాలుగా కట్టు కథలను అల్లేస్తున్నారని , ఫ్రెండ్స్ లాగా కూడా వెళ్ళకూడదా అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నైనా ఇలాంటి ప్రచారాలు ఆపాలని రిక్వెస్ట్ చేసింది.తాజగా ఆమె హీరో కార్తి సరసన మంచి ఛాన్స్ కొట్టేసింది. జపాన్ అనే పేరుతో రూపందుతున్న ఈ సినిమా సోమవారం పూజా కార్య క్రమం చెన్నైలో ప్రారంభమైంది.