వారి మరణంతో మానసికంగా కృంగిపోయిన కృష్ణ..!

-

సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు ఉదయం 4:00 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఇక ఆయన మరణంతో అటు రాజకీయరంగం ఇటు సినీ రంగం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే మొదట హార్ట్ ఎటాక్ వచ్చిందని హాస్పిటల్ జాయిన్ అయినా కృష్ణ గారికి మల్టీ ఆర్గాన్స్ పనిచేయకపోవడం వల్లే శరీరం చికిత్సకు సహకరించక ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మానసికంగా మరింత కృంగిపోయినట్లు ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో 1961లో ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదు మంది సంతానం .. వారిలో రమేష్ బాబు, మహేష్ బాబు, ప్రియదర్శిని , మంజుల , పద్మావతి అని పిల్లలు ఉన్నారు. ఇక ఆ తర్వాత కృష్ణ సినిమాలపరంగా తనకు ఎంతో చేదోడువాదోడుగా ఉండి తనకు భార్యగా వచ్చిన నిర్మలదేవి మరణం ఆయన జీర్ణించుకోలేకపోయారు. ప్రముఖ నిర్మాత, హీరోయిన్ , దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న విజయనిర్మల ను సూపర్ స్టార్ కృష్ణ సినిమాలలో నటిస్తున్నప్పుడే ఆమెతో ప్రేమలో పడి మొదటి భార్య ఇందిరా దేవి ని ఒప్పించి మరీ 1969లో వివాహం చేసుకున్నారు. అయితే విజయనిర్మలకు అప్పటికే కొడుకు నరేష్ ఉన్నాడు .

అయితే 2019లో విజయనిర్మల అనారోగ్యంతో కన్నుమూయడంతో కృష్ణ మానసికంగా కృంగిపోయారు. మరి ఇదే ఏడాది జనవరిలో ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణంతో మరింతగా కుషించిపోయిన కృష్ణ ఇదే ఏడాది సెప్టెంబర్ నెలలో భార్య ఇందిరాదేవి కూడా మరణించడంతో మరింతగా కృంగిపోయారు. ఇలా తనకు ఎంతగానో ఇష్టమైన ముగ్గురు వ్యక్తులను కోల్పోవడంతో కృష్ణ మానసికంగా మరింత కుషించుకుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన శరీర అవయవాలు కూడా సరిగా పనిచేయక, చికిత్సకు సహకరించక ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news