ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదు.. అట్రాసిటీ కేసు చెల్లదు అంటూ ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి చర్చి పాస్టర్ గా జీవనం సాగిస్తున్నాడు.

అయితే చర్చి నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అక్కల రామిరెడ్డి మరికొంత మందిపై చింతాడ ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ అక్కల రామిరెడ్డి మరియు ఇతరులు హైకోర్టును ఆశ్రయించగా.. ఇరు వాదనలు విన్న హైకోర్టు మతం మారిన ఎస్సీ వ్యక్తి హిందువు కాజాలడని, అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని తీర్పునిచ్చింది.