పది రోజుల క్రితం మరణించిన బాలిక.. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘనత వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే బాలిక అదే గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్లో చదువుతుంది.

ఏప్రిల్ 17న అనారోగ్యంతో నాగచైతన్య మరణించింది, బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచింది. ఈ విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు.
కాగా నిన్న తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. మధ్యాహ్నం రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి పదో తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలే సత్తా చాటారు.‘పది’ ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు ఆధిపత్యం సాధించారు.