డైరెక్టర్ మోహన్ రాజాకు ఆ హీరో హ్యాండ్ ఇచ్చాడా..!!

-

చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటు హిట్ అటు ప్లాప్ అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి తో చాలా రోజులు కూర్చోని ఆయన అడిగినన్ని మార్పులు ఏమాత్రం విసుగు లేకుండా ఓపిక తో చేసుకుంటూ వచ్చారు. అసలే లేక లేక వచ్చిన అవకాశం అది కూడా మెగాస్టార్ చిరంజీవి తో అయ్యే సరికి తాను చాలా ఆనంద పడ్డాడు.

తన కెరియర్ మరో లెవల్లో ఉండబోతుంది అని కలలు కన్నాడు. తీరా ఆ కలలన్నీ కల్లలు అయ్యేలే ప్రస్తుత పరిస్థితి ఉందట.తాను అనుకున్నవిధంగా ‘గాడ్ ఫాదర్’ వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కు కొద్ది దూరంలో ఆగి పోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు చాలా మంది మోహన్ రాజా కు నెక్స్ట్ సినిమా చేయాలని అడిగారట. వారిలో కింగ్ నాగార్జున కూడా ఉన్నారట.

ఒక పక్క తన సినిమా ది ఘోస్ట్ ప్లాప్ కావడం అలాగే గాడ్ ఫాదర్ సినిమా కూడా అంతగా వసూళ్ళు సాధించక పోవడంతో  మోహన్ రాజా తో సినిమా చేసే విషయంలో నాగార్జున ఆలోచనలో పడ్డారని వార్తలు వనిపిస్తున్నాయి. ప్రస్తుతం తనని హోల్డ్ లో పెట్టి మరో యంగ్ డైరెక్టర్ తో నాగార్జున చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనితో మోహన్ రాజా దిక్కు తోచని స్థితిలో పడ్డారట.

Read more RELATED
Recommended to you

Latest news