రాజకీయాల కోసం కూతురి పేరుని వాడుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందని మండిపడ్డారు మాజీ ఎంపీ, బిజెపి నేత బూర నర్సయ్య గౌడ్. కవితను ఆహ్వానించడం కాదు.. టిఆర్ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేస్తామన్నా కూడా ఒప్పుకోమన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనపై సిబిఐ లేదా హైకోర్టు జడ్జితోనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు.
నలుగురు ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఎందుకు నిర్బంధించారో చెప్పాలన్నారు బూర నర్సయ్య. ఇక నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత ఓటమి వెనక టిఆర్ఎస్ అధిష్టానం ఉందని ఆరోపణలు ఉన్నాయన్నారు. కవిత టిఆర్ఎస్ పార్టీలో మరో పవర్ సెంటర్ కావద్దన్న కారణంతోనే ఆమెను ఓడించారని వెల్లడించారు. ఇక వచ్చే ఎన్నికలలో 90% మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవరని జోష్యం చెప్పారు. బీసీల ఆర్థిక అణిచివేతకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు.