అల్లు అర్జున్ పుష్ప మలయాళంలో ప్రకంపనలు..!!

-

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1 సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో మన అందరికి తెలుసు. ఈ సినిమా తో ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళి పోయారు. అల్లు అర్జున్ స్టయిల్ ఆఫ్ యాక్షన్ కు దేశం మొత్తం పిధా అయ్యింది. ఇప్పుడు అందరూ రెండొ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుగుతోంది.

ఇక ఈ సినిమా టీజర్ ను అవతార్ సినిమా విడుదల అయ్యే థియేటర్స్ లో రిలీజ్ చేయాలని సుకుమార్ తాపత్రయ పడుతున్నాడు.  సుకుమార్ ఎమోషన్, యాక్షన్ తో తన దైన శైలిలో స్క్రీన్ ప్లే తో మాయ చేయబోతున్నాడట. అలాగే  నెక్స్ట్ షెడ్యూల్ షూటింగు ను మారేడుమిల్లితో పాటు బ్యాంకాక్ అడవుల్లో ఎక్కువ రోజులు షూటింగ్ చేయబోతున్నారట.

Allu-Arjun
Allu-Arjun

ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకొనే మరో న్యూస్ హల్చల్ చేస్తోంది. గతంలో విడుదల అయిన పుష్ప సినిమా ను కేరళలో  మళ్లీ భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే పుష్ప మలయాళ వర్షన్ ను రీ రిలీజ్ కోసం పనులు స్టార్ట్ చేశారట.ఒక డబ్బింగ్ సినిమా కేరళలో రిలీజ్ అయ్యి హిట్ కావడమే గొప్ప అయితే మళ్లీ ఆ సినిమా రీ రిలీజ్ అంటే ఎంతో క్రేజ్ ఉంటేనే సాధ్యం. ఈ న్యూస్ విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు. దీని గురించి నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news