అరవింద్ కుక్కలాంటివాడు – ఎమ్మెల్యే బాజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ నేతలు మాటల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కుక్కలాంటివాడు అని.. అందుకే ఆయనకు తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు. అరవింద్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ తో పాటు, కవిత, స్థానిక నేతలను విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అరవింద్ నోరు అదుపులో పెట్టుకోకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఇంకా జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇక టిఆర్ఎస్ కార్యకర్తలు ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవితపై అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రెచ్చిపోయారు. బంజారాహిల్స్ లోని అరవింద్ నివాసంలోకి చొరబడ్డ టిఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news