”ఆదిపురుష్” పై కృతి సనన్ వైరల్ కామెంట్స్..!!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. ఇది వచ్చే సంక్రాంతి కానుక గా రిలీజ్ చేద్దామని అనుకుంటే గ్రాఫిక్స్ వర్క్ కోసం రిలీజ్ వచ్చే సంవత్సరం జూన్ కు వాయిదా వేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాల తో వుంటే  ప్రమోషన్స్ లో భాగంగా  రిలీజ్ చేసిన టీజర్  లో గ్రాఫిక్స్ నాసిరకం అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అలాగే చాలా మంది   హిందూ దేవుళ్లను కించ పరిచేలా వుందని విమర్శించారు.

ఈ సినిమా  గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో మళ్లీ VFX వారితో మాట్లాడి, మంచిగా వచ్చేలా చేయటం కోసం డైరెక్టర్ ఓం రౌత్ నిర్మాత తో మాట్లాడి మరో వంద కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇక బాగా విమర్శలు వచ్చిన  హనుమంతుడు, రావణాసురుడు వేసిన నటులతో మళ్లీ రీ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమా ను ఆరు నెలలు వాయిదా వేశారు.

ఇక ఈ సినిమా లో సీత పాత్ర చేసిన బాలీవుడ్ నటి కృతి సనన్ అధిపురుష్ సినిమా  పై కామెంట్స్ చేసింది. ఈ సినిమా కోసం తాము చాలా కష్టపడి పనిచేశామని , అలాగే ముందుగా వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నానని తెలిపింది. అలాగే సినిమా చేసేటప్పుడు కూడా మంచి అనుభూతి కలిగిందని, టీజర్ చూసి సినిమాను బాడ్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది. అలాగే సినిమా వాయిదా పడ్డా కూడా గ్రాఫిక్స్ కోసం టైం తీసుకున్నారని, సినిమా మంచి విజువల్స్ తో మిమ్ముల్ని అలరిస్తుందని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news