దేవుడా.. రెండు జాబ్‌లు చెయ్యోద్దంటు ద్రావిడ్‌కు నోటీసులు

-

భారత్ క్రికెట్ దిగ్గజాలకు కొదవలేదు. అందులో వివాదరహితులుగా ఉన్నవారు చాలా తక్కువ మంది. దేశ ప్రయోజనాలను పరిరక్షించడమే కాకుండా తన జీవితాన్ని సర్వస్వం క్రికెట్‌కే త్యాగం చేస్తున్నవారిలో మాజీ క్రికెటర్ ద్రావిడ్ అగ్రస్థానంలో ఉంటాడు అనడంలో సందేహం లేదు. అయితే అటువంటి వివాదరహితుడికి బీసీసీఐ అంబుడ్స్‌మన్ నోటీసులు ఇవ్వడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే…

ombudsman and bcci notice rahul dravid
ombudsman and bcci notice rahul dravid

గతంలో విరుద్ధ ప్రయోజనాల అంశం కారణంగానే ఐపీఎల్ మెంటార్ పదవిని విడిచిపెట్టి భారత జూనియర్ కోచ్ పదవికి ద్రవిడ్ పరిమితమయ్యాడు. ప్రస్తుతం ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఇండియా సిమెంట్స్ సంస్థలో వైస్‌ఛైర్మన్‌గా అతను ఉండటంతో విరుద్ధ ప్రయోజనాల అంశంగా బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ నోటీసులు ఇచ్చారు. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ద్రవిడ్‌ను ఆదేశించారు.

క్రికెటర్ల స్పందన..

టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్ నోటీసులు ఇవ్వడంపై భారత్ మాజీ కెప్టెన్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వార్తల్లో నిలవడానికే నోటీసులు ఇచ్చారని.. భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలని ట్విటర్‌లో పేర్కొన్నాడు. భారత క్రికెట్‌లో ఇదో కొత్త ఫ్యాషన్. విరుద్ద ప్రయోజనాల కింద నోటీసులు ఇవ్వడం.. వార్తల్లో నిలవడం. భగవంతుడే భారత క్రికెట్‌ను కాపాడాలి. బీసీసీఐ అంబుడ్స్‌మన్ ద్రవిడ్‌కు నోటీసులు ఇచ్చారు. అని ట్వీట్ చేశాడు.

భారత బౌలర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ గంగూలీ ట్వీట్‌కు మద్దతు తెలిపాడు. భారత క్రికెట్‌లో ద్రవిడ్‌కు మించిన మరో అత్యుత్తమ క్రికెటర్ లేడని, అలాంటి లెజెండ్‌కు నోటీసులు ఇవ్వడం అవమానకరం అని మండిపడ్డారు. నిజంగా ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియడం లేదు. భారత క్రికెట్‌లో రాహుల్ ద్రవిడ్‌కు మించిన మరో అత్యుత్తమ ఆటగాడిని పొందలేము. అలాంటి లెజెండ్‌కు నోటీసులు ఇవ్వడం అవమానకరం. భారత క్రికెట్ మెరుగుదల కోసం అలాంటివారి సేవలు అవసరం. అవును భారత క్రికెట్‌ను భగవంతుడే కాపాడాలి. అని ట్వీట్ చేశాడు భజ్జీ. ఈ విషయం పై మిగిలిన క్రీడాకారులు, బీసీసీఐ బాధ్యులు ఎలా స్పందిస్తారో వేచిచూద్దాం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news