తెలుగు బిగ్ బాస్ షోపై విమర్శలు చేస్తున్న నెటిజన్స్..!!

-

తెలుగు బిగ్ బాస్ షో కంటెస్స్టెంట్ ల పోరాటం తో రక్తి కడుతుంది. అసలే మసాలా బ్యాచ్ మరియు కామెడీ బ్యాచ్ పోవటం తో ఢీలా పడ్డ షో ను నిర్వాహకులు కంటెస్స్టెంట్ మధ్య గిల్లి కజ్జాలు పెడుతూ, టాస్క్ లలో వాళ్ళలో వాళ్లు కొట్టుకొని తిట్టుకొనేలా చేసి గొడవలు పెడుతున్నాడు. ఇక నిన్న ఆదివారం నాడు వచ్చిన ఎపిసోడ్ లో అందమైన జంట గా ఉన్న మెరీనా, రోహిత్‌ లను విడదీసి, మెరీనాను ఎలిమినేట్ చేశాడు.

దీనిపై మరో సారి నెటిజన్స్  బిగ్‌ బాస్‌ 6పై ట్రోల్స్ చేస్తున్నారు. అసలు మంచిగా ఆడుతున్న సూర్య ను , గలాటా గీతు ను ఎలిమినేట్ చేశారు. ఎప్పుడూ అబద్దాలతో సహజీవనం చేస్తున్న  శ్రీసత్యని సేవ్‌ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె బదులు మెరీనా ను ఎలిమినేట్‌ చేశారని విమర్శిస్తున్నారు. ఈ వారం శ్రీ సత్యని ఎలిమినేట్‌ చేయాలని గత మూడు నాలుగు రోజులుగా బిగ్‌ బాస్‌ ఆడియెన్స్ కోరుతున్నారు. ఆమె జెన్యూన్ ఆట ఆడటం లేదని ఎప్పుడూ నక్క వినయాలు నటిస్తూ ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.

నిజానికి ఇద్దరి మధ్య ఓట్ల శాతం వన్‌ పర్సెంటేజ్‌ కంటే తక్కువే. జీరో పాయింట్‌ రెండు, మూడు శాతం మాత్రమే ఉంటుంది. అయినా ఎలిమినేషన్‌ తప్పలేదు. బట్‌ ఆడియెన్స్ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో మాత్రం శ్రీసత్య జెన్యూన్‌ గా లేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మదర్‌ ఇండియాని పంపించి, కాటేసే పామును కాపాడారని కామెంట్లు  చేస్తున్నారు. కనీసం వచ్చే వారం అన్నా ఈమెను ఎలిమినేట్ చెయ్యాలని, న్యాయంగా ఎలిమినేషన్ ఉండాలని కోరుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news