మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నోటీసులు అందుకున్న హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్‌ను విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. సిట్ నోటీసుల ప్రకారం రేపు విచారణకు హాజరుకావాలని ప్రతాప్‌కు స్పష్టంచేసిది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రతాప్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తాను నిందితుడు, అనుమానితుడు కానప్పటికీ 41ఏ నోటీసు ఇచ్చారన్న పిటిషనర్ తెలిపారు. కారణాలు ఉన్నందునే న్యాయవాది ప్రతాప్‌కు నోటీసు ఇచ్చినట్లు సిట్ తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. సిట్ విచారణకు హాజరుకావాలని ప్రతాప్‌కు తెలిపింది.
మరోవైపు ఇదే కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద అధికారులు తాఖీదులు ఇచ్చారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈనెల 29న సిట్ ఎదుట హాజరు కావాలని స్పష్టంచేశారు. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ని నిందితులుగా చేర్చారు. ఈ మేరకు ఏసీబీ ప్రత్యేక కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది.