రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిని తిట్టి ఇప్పుడు ప్రాజెక్టులు ఎలా ఇచ్చారు : కే.ఏ.పాల్

-

రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిని తిట్టి ఇప్పుడు ప్రాజెక్టులు ఎలా ఇచ్చారు కే.ఏ.పాల్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియా మాట్లాడుతూ మేఘాకృష్ణారెడ్డిని రోజూ తిట్టాడు.. గజదొంగ, పెద్ద దొంగ, కాళేశ్వరం ప్రాజెక్ట్.. ఈ మధ్యన కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాళేశ్వరం కాదు.. ఇది కూళేశ్వరం అని అన్నారు. కాళేశ్వరాన్ని మేము మూసేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

అలాంటి కాళేశ్వరం మెఘా కృష్ణారెడ్డికి 15వేల కోట్ల ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్టు సైన్ చేశాడని ప్రశ్నించారు. 1లక్ష 10వేల కోట్ల అవినీతి జరిగింది.. 48వేల కోట్లు కనిపించడం లేదని, తెలంగాణ ప్రజలకు 2లక్షల కోట్లు అవినీతి అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడని ప్రశ్నించారు. మెఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మొన్న 4వేల కోట్లు ఖర్చు అయిందట. ఈ 4వేల కోట్లు ఎవరు ఇస్తున్నారు.. ఇవన్నీ డీటైల్స్ తో త్వరలో మీ ముందుకు వస్తానని తెలిపారు కే.ఏ.పాల్.  

Read more RELATED
Recommended to you

Latest news