అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని భారత-ఏ జట్టు టెస్ట్ మ్యాచ్ లు ఆడెందుకు బంగ్లాదేశ్ పర్యటన వెళ్లనుంది. ఈ సిరీస్ కు భారత-ఏ జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ పర్యటనకు భారత-ఏ జట్టు హెడ్ కోచ్ వివిఎస్ లక్ష్మణ్ దూరమయ్యాడు.
వివిఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భారత సీనియర్ జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా లక్ష్మణ్ తో పాటు బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిట్కర్, బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతాలే కూడా న్యూజిలాండ్ పర్యటనలో కూడా ఉన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ తో సిరీస్ కు గుజరాత్ మాజీ బ్యాటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ను భారత-ఏ జట్టు హెడ్ కోచ్ గా బీసీసిఐ నియమించింది.