ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా చాలా మంది ప్రయోజనాలని పొందుతున్నారు. వడ్డీ ని కూడా పీఎఫ్ ఖాతా కింద ప్రతి సంవత్సరం పొందుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8.1 శాతం వడ్డీని ఇస్తున్నారు. యాక్టివ్‌గా ఉన్న ఖాతాలకు మాత్రమే ఈ వడ్డీ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే మీ ఈపీఎఫ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినా వడ్డీని పొందవచ్చా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
ఉద్యోగుల కోసం పీఎఫ్ ఖాతా అనేది ఓపెన్ చేస్తారు. అయితే దీని మీద కంపెనీ, ఉద్యోగి ఇద్దరి ద్వారా కూడా సమానమైన సహకారం ఉంటుంది. అయితే డిపాజిట్ చేసిన సొమ్ముపై ప్రభుత్వానికి వడ్డీ ఇస్తారు. మీకు డబ్బులు కావలసినప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు మధ్య లో ఈ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయకపోతే రిటైర్మెంట్ టైం లో దీన్ని తీసుకోవచ్చు.
క్లోజ్ చేసేస్తే వడ్డీ ని ఇస్తారా..?
ప్రతి సంవత్సరం వడ్డీ ని ఇస్తారు. 2013 ఆర్థిక సంవత్సరంలో ఒక అతనికి మూడు సంవత్సరాల పాటు ఈపీఎఫ్‌కి విరాళం ఇవ్వకపోతే… వడ్డీ డబ్బుని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ 2016లో ఉపసంహరించుకుంది. ఒకవేళ మొత్తం డబ్బు విత్‌డ్రా చేయబడి ఉపయోగించబడక పోతే దానిపై వడ్డీ చెల్లించబడదు. రిటైర్మెంట్ పూర్తయినా వడ్డీ ఇవ్వరు. వయస్సు 58 ఏళ్ళు అయ్యి ఉంటే ఈపీఎఫ్ బ్యాలెన్స్ ని లెక్కించరు. వడ్డీ మొత్తం కూడా ఇవ్వరు.