స్టేట్ బ్యాంక్ గుడ్ న్యూస్.. రూ.25 వేల తగ్గింపు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని తీసుకు వచ్చింది. వీటి వలన చాలా లాభాలని పొందొచ్చు. పైగా చాలా మందికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కూడా వుంది. స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వలన కూడా మనకు ఎన్నో లాభాలు వున్నాయి. చాలా మంది క్రెడిట్ కార్డుని కూడా ఎక్కువగా వాడుతున్నారు. అలానే స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఆఫర్స్ కూడా ఉంటున్నాయి.

దీనితో మనం భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. కొన్ని బ్రాండ్స్ మీద అదిరే క్యాష్ బ్యాక్ ని పొందొచ్చు. అయితే ఈ ఆఫర్స్ డిసెంబర్ నెల చివరి వరకు మీకు అందుబాటులో ఉంటాయి. కనుక ఆ ఆఫర్స్ ని పొందొచ్చు. ఇక వాటి వివరాలు చూద్దాం. స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా హయర్ ప్రొడక్టులపై 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ ని పొందొచ్చు.

గరిష్టంగా రూ. 12 వేల వరకు మీరు పొందొచ్చు. అలానే ఐఎఫ్‌బీ ప్రొడక్టులని మీరు కొనుగోలు చేస్తే అప్పుడు మీరు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ని పొందేందుకు అవుతుంది. గరిష్టంగా రూ. 5 వేల వరకు తగ్గింపు మీకు దీనితో వస్తుంది. అంతే కాక ఎల్‌జీ ప్రొడక్టులపై 22.5 శాతం, లాయిడ్ ప్రొడక్టులపై రూ. 4,500 క్యాష్ బ్యాక్ వస్తుంది. శాంసంగ్ ప్రొడక్టులపై 27.5 శాతం, టీసీఎల్ ప్రొడక్టులపై గరిష్టంగా రూ. 10 వేల వరకు ఆఫర్ ని పొందొచ్చు.

వర్ల్‌పూల్ పైన రూ. 7,500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. ఒప్పొ స్మార్ట్‌ఫోన్స్‌పై రూ. 4 వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. అలానే వివో స్మార్ట్‌ఫోన్స్‌పై రూ. 8 వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. హీరో టూవీలర్లపై రూ. 5 వేల వరకు క్యాష్‌బ్యాక్ ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news