షర్మిల మాట్లాడే భాష ఆడపిల్ల మాట్లాడే భాషేనా? – బాల్క సుమన్

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. షర్మిల మాట్లాడే భాష ఆడపిల్ల మాట్లాడే భాషేనా? ప్రశ్నించారు. షర్మిల ఆడపిల్ల మాదిరిగా మాట్లాడుతుందా అని అడిగారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మా కార్యకర్తలను ఆపడం మావల్ల కూడా కాదని అన్నారు. షర్మిల మాదిరిగానే తమ కూడా ఏపీకి వెళ్లి జగన్ ను, అక్కడి ఎమ్మెల్యేలను తిడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.

సంస్కారహీనంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్న ఏం మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణలో తిరుగుతూ తమనే దూషిస్తుందన్నారు బాల్క సుమన్. తెలంగాణ పోరాటం గురించి షర్మిలకు ఏం తెలుసో చెప్పాలన్నారు. షర్మిల ఎవరు? ఆమె వెనక ఎవరున్నారో తెలంగాణ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. షర్మిల ఇలాగే మాట్లాడితే జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని హెచ్చరించారు బల్క సుమన్.

Read more RELATED
Recommended to you

Latest news