హిట్ 2 మూవీ రివ్యూ..!

-

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న యంగ్ హీరోలలో అడవి శేష్ కూడా ఒకరు. ఎప్పుడూ కూడా డిఫరెంట్ జోన్లలో ఉండే కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు. ఈ హీరోకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. మేజర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించారు అడవి శేష్. తాజాగా ఈ రోజున హిట్ -2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రాన్ని ఏడు సినిమాలకు ప్లాన్ చేస్తున్నట్లుగా హీరో నాని తెలియజేయడం జరిగింది.నాని హిట్ సినిమాలకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రోజున హిట్-2 సినిమా విజయం సాధించిందా? లేదా? అనే విషయం తెలుసుకుందాం.

కథ:
అడవి శేషు ఇందులో (kd) గా ఒక కూల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. అతను ఎప్పుడూ తన చాలెంజ్ ను చేదించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏ కేసునైనా సరే క్షణాలలో పరిష్కరించడంలో కేడి సిద్ధహస్తుడు. కానీ అనుకోకుండా సంజన అనే కేసు విషయంలో మాత్రం ఎన్నో సవాల్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ దర్యాప్తు విషయంలో హంతకుడు గురించి కేడి తెలుసుకున్న విషయాల వలన ఈ కథ మలుపు తిరగడం జరుగుతుంది. దీంతో సంజనా కేసును కేడి సాల్వ్ చేశారా లేదా అన్న కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు.

అడవి శేష్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్గా అద్భుతంగా నటించారని తెలుస్తోంది అయితే ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు కాస్త అసౌకర్యంగా అనిపించాడు. ఇక మీనాక్షి హీరోయిన్గా ఇందులో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇక ఇందులో రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యర్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.. గతపరంగా పాతది అయిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు
ఇంటెన్సిటీ
సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్
ఎమోషన్ అంతగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది.

హిట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్ సేన్.. హీట్ -2 సినిమా విషయానికి వస్తే నెమ్మదిగా ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. ఇంటర్వెల్ టెస్ట్ తర్వాత బాగా సినిమాకి మరింత హైలైట్ గా ఉన్నది సెకండాఫ్ కథ వేగం పెరగడంతో ఈ సినిమాకు ప్లస్సుగా మారింది. థ్రిల్లర్ సినిమాలకు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఫైనల్ గా ఎట్టకేలకు ఏ సినిమాకి 3.6/5 రేటింగ్ ఫైనల్ గా అడవి శేషు మంచి విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news