ఏపీలో నామినేటేడ్ పోస్టుల జాతర మొదలైంది. ఏపీలో వివిధ నామినేటేడ్ పోస్టుల భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్. వివిధ కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్ల నియామకం చేసింది కూటమి సర్కార్. మొత్తం 20 కార్పోరేషన్ల ఛైర్మన్ల పదవులను భర్తీ చేసింది. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి హై ప్రయార్టీ ఇచ్చిందని సమాచారం.
ఇందులో టీడీపీ – 16, జనసేన -3, బీజేపీ – 1 చొప్పున 20 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది కూటమి సర్కార్.
ఏపీలో నామినేటేడ్ పోస్టుల లిస్ట్
- వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజీజ్
- శాప్ – అనిమిని రవి నాయుడు
- హౌసింగ్ బోర్డు – బత్తుల తాతయ్య బాబు
- ట్రైకార్ – బురగం శ్రీనివాసులు
- ఏపీ మారిటైం బోర్డు – దామచర్ల సత్య.
- సీడ్ యాప్ – దీపక్ రెడ్డి
- 20 సూత్రాల అమలు – లంకా దినకర్ (బీజేపీ)
- ఏపీ మార్క్ ఫెడ్ – కర్రోతు బంగార్రాజు
- విత్తనాభివృద్ధి సంస్థ – మన్నె సుబ్బారెడ్డి
- ఏపీఐఐసీ – మంతెన రామరాజు
- పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ – నందం అబద్దయ్య
- ఏపీ టీడీసీ – నూకసాని బాలాజీ
- ఏపీఎస్సార్టీసీ ఛైర్మన్ – కొనకళ్ల నారాయణ
- ఏపీఎస్సార్టీసీ వైస్ ఛైర్మన్ – పీఎస్ మునిరత్నం.
- ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ – పీలా గోవింద్
- లిడ్ క్యాప్ – పిల్లి మాణిక్యాల రావు.
- ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ – పీతల సుజాత
- ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ – తమ్మిరెడ్డి శివ శంకర్ (జనసేన)
- పౌరసరఫరాల కార్పోరేషన్ – తోట మెహర్ సీతారామ్ సుధీర్. (జనసేన)
- ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ – వజ్జా బాబురావు
- ఏపీ టిడ్కో – వెనుములపాటి అజేయ్ కుమార్ (జనసేన)