తిరుమల లడ్డూ వివాదం.. హిమాయత్ నగర్‌లోని టీటీడీలో మాజీ ఎంపీ వీహెచ్ దీక్ష

-

తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఉత్తర భారతం నుంచి కూడా లడ్డూ కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.సెలబ్రిటీలు సైతం దీనిపై స్పందిస్తున్నారు. ఇక తెలంగాణలోనూ తిరుపతి లడ్డూపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఏకంగా దీక్ష చేపట్టారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి హిమాయత్ నగర్‌లోని టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆయన దీక్షకు దిగారు.

తిరుమలలో పవిత్రమైన శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వాడారని ప్రచారం జరుగుతుందగా, దీనిపై సమగ్ర విచారణ కోసం సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.కాగా,తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని,నాణ్యతా రహితమైన వస్తువులను వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఆరోపించారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారని గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news