తిరుమలకు జగన్ వెళ్లకూడదు – చంద్రబాబు సంచలనం !

-

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడిని దర్శించుకోవచ్చు అని… అయితే ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమని చంద్రబాబు ట్వీట్ చేశారు. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని వెల్లడించారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే జగన్ తిరుమల ఎందుకు వెళ్లాలి? అంటూ ఆగ్రహించారు.

JAGAN 8 QUESTIONS TO CHANDRABABU

జగనుకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదు.. అది అడిగితే బూతులు తిట్టారని తెలిపారు. ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా? అన్నారని గుర్తు చేశారు. హనుమంతుడు బొమ్మా? వెంకటేశ్వరస్వామి బొమ్మా?… రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారని ఆగ్రహించారు. రధం కాలిపోతే.. ఏముందీ తేనెటీగలు వచ్చాయి అన్నారని.. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుందని అడిగారని ఫైర్‌ అయ్యారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని… అందుకే బాధపడుతూ చెబుతున్నా అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news