అదిరే స్కీమ్.. రూ.50 డిపాజిట్ చేస్తే చాలు రూ. 35 లక్షలు..!

-

పోస్టాఫీసు ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ ద్వారా చాలా మంది ప్రయోజనాలని పొందుతున్నారు. పోస్టాఫీసు వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకు రాగ… అందులో గ్రామ సురక్ష పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్ తో మనం చక్కటి లాభాలని పొందేందుకు అవుతుంది. ఇక స్కీమ్ కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈ స్కీమ్ లో డబ్బులని పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

పోస్టాఫీసు లో డబ్బులు పెడితే నెల నెలా మంచిగా డబ్బులు వస్తాయి. గ్రామ సురక్ష పథకం లో మీరు ప్రతీ నెలా కేవలం రూ. 1500 డిపాజిట్ చేస్తూ ఉండాలి. అప్పుడు 31 నుంచి 35 లక్షల ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇక ఎవరు దీనికి అర్హులు అన్నది చూస్తే.. 9 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఎవరైనా ఈ స్కీమ్ కింద బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఈ స్కీమ్ కింద కనీస బీమా మొత్తం రూ. 10,000 నుంచి రూ. 10 లక్షల వరకు వుంది.

ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. నెలవారీ, త్రైమాసికం, అర్ధ-సంవత్సరం లేదా వార్షికంగా పే చేయవచ్చు. లోన్ కూడా తీసుకోవడానికి అవుతుంది. ఇక ఎంత డబ్బులు వస్తాయి అనేది చూస్తే… 19 సంవత్సరాల వయస్సు లో స్కీమ్ లో రూ. 10 లక్షల పాలసీని తీసుకుంటే… నెలవారీ ప్రీమియం 55 ఏళ్ళకి రూ.1515, 58 సంవత్సరాలకు రూ. 1463, 60 సంవత్సరాలకు 1411 ఉంటుంది. ఇదిలా ఉంటే 55 సంవత్సరాలకు రూ. 31.60 లక్షలు, 58 సంవత్సరాలకు రూ. 33.40 లక్షలు, 60 సంవత్సరాలకు రూ. 34.60 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news