పవన్ కల్యాణ్ – సుజిత్ మూవీపై అకీరా నందన్ రియాక్షన్ ఏంటంటే..

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహు దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్టు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ఏమన్నాడు అంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం విషయంలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ చాలా ఆనందంగా ఉన్నాడని తెలిపాడు హీరో అడవి శేషు.. సాహో సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో తనకు ఎంత ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ నటించడం ఆనందంగా ఉందని తెలిపాడు అడవి శేషు..

‘హిట్‌-2’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్‌.. తన మిత్రుడు సుజిత్, పవన్‌ కల్యాణ్ తో సినిమా చేయడంపై స్పందిస్తూ.. “దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సుజిత్‌కు సరైన ప్రాజెక్ట్‌ కుదిరింది. ‘సాహో’ తర్వాత ఇద్దరు బాలీవుడ్‌ స్టార్స్‌ సుజిత్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు.. కానీ అందుకు అతను అంగీకరించలేదు తెలుగులోనే సినిమా చేయాలనుకుంటున్నట్టు వారితో చెప్పాడు. అలా, తనకెంతో ఇష్టమైన హీరోతో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో అకీరా కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. సినిమా కోసం తను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు” అని చెప్పుకొచ్చాడు అడవి శేష్..

పవర్‌స్టార్‌ హీరోగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం అలాగే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కూడా ఈ సినిమా ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం మరో స్థాయిలో ఉండబోతుందని ఇందుకోసం ప్రేక్షకులతో సహా పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news