ప్రభాస్, మారుతి సినిమా అనుకున్న బడ్జెట్ కంటే డబుల్..!!

-

ప్రభాస్ హీరోగా నటించిన  బాహుబలి 1,2 సినిమాలతో తన పాపులారిటీ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే.దాని తర్వాత విడుదల అయిన సాహో బాలీవుడ్ లో ఆడినా తెలుగులో అంతగా వసూళ్లు రాబట్టలేక పొయింది. ఇక ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ దారుణంగా ప్లాప్ అయ్యింది. దానితో పాన్ ఇండియా స్టార్ గా వచ్చిన క్రేజ్ మొత్తం పోయింది. అయినా కూడా ప్రభాస్ రాజమౌళి సలహాలు తీసుకొని చాలా సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు.

ప్రస్తుతం రామాయణం ఆధారంగా తీస్తున్న ఆది పురుష్  వచ్చే సంవత్సరం విడుదల కు సిద్ధంగా వుంది. తర్వాత సలార్, ప్రాజెక్ట్ K సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు.అయితే వీటి అన్నింటి మధ్యలో ప్రభాస్, మారుతీ దర్శకత్వంలో ఒక చిన్న సినిమా చేస్తున్నాడు. ఇది దయ్యం కాన్సెప్ట్ తో ఒక సినిమా థియేటర్ చూట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. అలాగే దీనిలో ప్రేమ కథా చిత్రం లాగా కామెడీ, ఎంటర్టైన్మెంట్ , అలాగే ప్యాన్స్ ను ఆకట్టుకునే అంశాలు వుండేలా మారుతి చూసుకుంటున్నాడట.

అలాగే దీనిలో తాత మనవడు సెంటిమెంట్ సూపర్ గా ఉంటుందట. అలాగే సినిమా పేరు కూడా సినిమా థియేటర్ పేరు, ప్రభాస్ పేరు వచ్చేలా సినిమా రాజా డీలక్స్ గా పిలుస్తూ ఉన్నారని అంటున్నారు.. అలాగే ప్రభాస్ ను ఇబ్బంది పెట్టకుండా మారుతి చాలా కేర్ తీసుకొని షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ముందు అనుకున్న బడ్జెట్ ప్రభాస్ రెమ్యునరేషన్ కాకుండా 50 కోట్లు అన్నది 100 కోట్లు అయ్యేలా ఉందని అంటున్నారు. సినిమా క్వాలిటీగా రావాలని అలాగే పెద్ద థియేటర్ సెట్టింగ్, VFX కోసం చాలా ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారని తెలుస్తొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news