బెడ్డెక్కిన అందాల అదా శర్మ.. అలా పోజులు ఇస్తూ కుర్రకారుని చంపేస్తోందిగా!

-

హీరోయిన్ అదా శర్మ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ మూవీతో టాలీవుడ్ ఆడియన్స్‌‌కు తన గ్లామర్‌తో నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించింది. ఇక అదాకు చేతి నిండా సినిమాలు లేకపోయినా.. ఎపుడు ఏదో ఒక ఫోటో షూట్‌తో వార్తల్లో నిలుస్తూ ఉండటం విశేషం. తాజాగా ఈ అమ్మడు బెడ్డెక్కి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. లేటెస్ట్ డ్రెస్‌లో అదా శర్మ హాటు అందాలు అభిమానులను కిక్కెస్తున్నాయి.

నితిన్ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదా. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ భామకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. కానీ అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాను మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తూనే ఉంది అదా శర్మ.

బోలెడంత గ్లామర్ ఉన్నా.. ఈ భామకు మాత్రం సరైన అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. హర్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ.. ఆ తర్వాతా అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి, సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ఆది సాయి కుమార్‌తో ‘గరం’, అడివి శేష్‌తో ‘క్షణం’, రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమాల్లో నటించింది.

అందాలు ఆరబోసినా ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. దీంతో హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. పలు చిత్రాల్లో నటిస్తూ, హాట్.. హాట్.. ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేయడం అదా స్పెషాలిటీ. అదా శర్మ విషయానికొస్తే.. ఈ భామ 1992 మే 11న ముంబైలో జన్మించింది. అక్కడే స్కూల్ మరియు కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆ తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఆపై సినిమాల్లో అవకాశాలను పట్టేసింది. అదా శర్మ తండ్రి ఎస్ ఎల్ శర్మ మర్చంట్ నేవిలో కెప్టెన్‌గా పనిచేసారు. ఆమె తల్లి ప్రముఖ క్లాసికల్ డాన్సర్. ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ.

అందాలు ఆరబోసినా ఈ బ్యూటీకి తెలుగులో కలిసి రాలేదు. దీంతో హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తూ, హాట్.. హాట్.. ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. అప్పట్లో కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూ తన గ్లామర్ షోతో ఆడియన్స్‌ను పిచ్చెక్కించింది. అదా శర్మ మంచి జిమ్మానిస్టక్‌లో మంచి పట్టు ఉంది. అంతేకాదు డాన్సుల్లో కథక్, భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది.

మోడలింగ్‌లో రాణిస్తోన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్స్‌కు అటెండ్ అయింది. అన్నింట్లో ఈమెకు ఎక్కువగా రిజెక్ట్ ఎదురైంది. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న తర్వాత కానీ తొలి అవకాశం రాలేదు.  తొలి సినిమా అవకాశం వచ్చినా .. మరో అవకాశం కోసం దాదాపు 6 యేళ్లకు పైగా వెయిట్ చేయాల్సి వచ్చింది. కేవలం సినిమాల్లోనే కాకుండా.. పలు వెబ్ సిరీస్‌లతో పాటు.. షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు.. మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది.

Read more RELATED
Recommended to you

Latest news