జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు ఓ ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనం రంగు మిలిటరీ వాహనాలను పోలివుందంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆక్షేపించారు. ఇది నిబంధనలకు విరుద్ధం అన్నారు.
అందుకు పవన్ కళ్యాణ్ కూడా స్పందించి పలు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ.. ” మొదట ఈ వైసీపీ వాళ్లు నా సినిమాలను ఆపేశారు. విశాఖపట్నంలో నన్ను వాహనం & హోటల్ గది నుండి బయటకు రానివ్వలేదు. నన్ను నగరం వదిలి వెళ్ళిపోమని నోటీసులు ఇచ్చారు. మంగళగిరిలో మీరు నా కారు నుంచి బయటకు వెళ్ళనివ్వలేదు. తర్వాత నన్ను కనీసం నడవనివ్వలేదు.
ఇప్పుడు నా ప్రచార రథం రంగు సమస్యగా మారింది. కనీసం నన్ను ఊపిరి తీసుకొనిస్తారా? పీల్చకుండా చేస్తారా? ” అని పవన్ కళ్యాణ్ ట్విట్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. ” శ్వాస తీసుకో.. ప్యాకేజీ వద్దు” అంటూ అంబటి కౌంటర్ ట్వీట్ చేశారు.
శ్వాస తీసుకో …ప్యాకేజీ వద్దు ! @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) December 9, 2022