తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ హరిశంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నారు. పంచతంత్రం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా డైరెక్టర్ హరీష్ శంకర్ రావడం జరిగింది. ఇక్కడ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.
ముఖ్యఅతిథిగా పాల్గొన్నటువంటి డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ కలర్ స్వాతి కలర్స్ కార్యక్రమం చూసినప్పటి నుంచి తను అంటే నాకు క్రష్ అని తెలియజేశారు. ఈమె ఆల్ టైం తన క్రష్ అని కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తను నటించే సినిమాలు ఎక్కువగా చూస్తానని తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటు ఉంటానని..అయితే వారికి న్యాయం చేయలేకపోతున్నానని తెలియజేశారు డైరెక్టర్ హరిశంకర్. ముఖ్యంగా పంచతంత్రం సినిమా అనే టైటిల్ పెట్టినప్పుడే డైరెక్టర్ సగం సక్సెస్ లో అందుకున్నారు. ఈ సినిమా చిన్న సినిమా అని అందరూ అనుకుంటూ ఉంటారు.. అయితే ఈ సినిమా విడుదలైన తరువాత ఈ చిత్రం చిన్నదా లేక పెద్దదా అనే విషయం మీకే తెలుస్తుంది అంటూ తెలియజేశారు.
పంచతంత్రం సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కలర్ స్వాతి మొదట కలర్స్ అనే కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి తెలుగమ్మాయిగా పేరు సంపాదించింది. వివాహం చేసుకున్న తర్వాత కలర్స్ స్వాతి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. చాలా కాలం తర్వాత పంచతంత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం హరిశంకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.