ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా రాజీపడబోం : ప్రధాని మోడీ

-

దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా భారత్ రాజీపడబోదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిద దళాల సైనికులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. దేశాన్ని రక్షించే సైనిక శక్తి పై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. భారత్ తన శత్రువుల మాటలు కాదు. సైనికుల ధృడ నిశ్చయాన్ని విశ్వసిస్తుందన్నారు. 

 

ప్రజలంతా సైనికుల వల్లనే దేశం సురక్షితంగా ఉందని భావిస్తున్నారని తెలిపారు. ప్రపంచం నిన్ను చూసినప్పుడు భారతదేశం బలాన్ని చూస్తుంది. కానీ శత్రువులు నిన్ను చూసినప్పుడు వారు తమ దుష్ట పన్నాగాల అంతాన్ని చూస్తారని సైనికులపై ప్రశంసలు కురిపించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని.. ఈ కలలకు సైనికులే రక్షకులు అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యం అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news