దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యం కావు : మల్లికార్జున ఖర్గే

-

వన్ నేషన్, వన్ ఎలక్షన్  నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే జమిలీ ఎన్నికల  నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.  జమిలి ఎన్నికలపై రామ్ నాథ్  కోవింద్ కమిటీ  రూపొందించిన నివేదికను ఇటీవలే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లను కూడా  ప్రవేశ పెట్టబోతున్నట్టు కేంద్ర కేబినెట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. అది రాష్ట్రాల సమస్యలు, ప్రాంతీయ పార్టీలతో ముడిపడిన జమిలి ఎన్నికలు దేశంలో సాధ్యం కావని పేర్కొన్నారు. దేశంలో జమిలి ఎన్నికలను ఎశ్వరూ అడ్డుకోలేరని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మోడీ చెప్పేద ఏది చేయరు. జమిలి ఎన్నికల అంశం పార్లమెంట్ కు వస్తే.. అందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే అది సాధ్యం. కాబట్టి జమిలి ఎన్నికలు సాధ్యం కావన్నారు ఖర్గే.

Read more RELATED
Recommended to you

Latest news