పోలీసు ఉద్యోగాల భర్తీపై నారా లోకేష్ బహిరంగ లేఖ

-

 

పోలీసు ఉద్యోగాల భర్తీపై నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి ఐదేళ్లు సడలించాలంటూ ఏపీ పోలీస్ నియామకాల బోర్డు చైర్ పర్సన్ కి లేఖ రాశారు లోకేష్. ఎట్టకేలకు వైసీపీ సర్కారు పోలీస్ ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషన్ నిబంధనలతో చాలా మందికి అందని ద్రాక్షలా మారిందన్నారు.

 

టిడిపి ప్రభుత్వ హయాంలో 2018లో పోలీసు ఉద్యోగాల భర్తీకి చివరి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతీ ఏటా పోలీసుశాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు, మూడున్నరేళ్ల తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగేళ్ల విరామం తర్వాత పోలీసు శాఖలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడడంతో ఉద్యోగార్థులు సంతోషపడ్డారనివెల్లడించారు.

అయితే వారి ఆనందం గరిష్ట వయో పరిమితి నిబంధనతో ఆవిరైంది. యువత ఏళ్ల తరబడి పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నారు. వారికి ఈ నోటిఫికేషన్ వేదన కలిగిస్తోంది. వయోపరిమితి నిబంధన వలన ఎంతోమంది అనర్హులుగా మారిపోయారు. పోలీసు ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి కనీసం ఐదు సంవత్సరాలు సడలించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news