సింహాచలంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింహాచలం భూముల పరిరక్షణ పై పూర్తి దృష్టి పెట్టామన్నారు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే అన్నారు మంత్రి కొట్టు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు దేవాదాయ శాఖ కు ఇప్పుడు తల నొప్పిగా మారాయి అన్నారు.
టిడిపి హయాంలో ఆక్రమణలు విపరీతంగా జరిగాయని ఆరోపించారు. సింహాచలం దేవస్థానం పరిధిలో 18 బీట్లు వున్నాయని.. ఇకపై ఆక్రమణలు జరిగితే ఆ ప్రాంత అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. పంచ గ్రామ భూ సమస్య కోర్టు పరిధిలో వుందని.. భూ సమస్య విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా వున్నారని తెలిపారు. నృసింహ యాగం క్రమం తప్పకుండా జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు.