రామ్ గోపాల్ వర్మ ను వెలి వేయాలి ! డైరెక్టర్ సంచలన కామెంట్స్

-

రామ్ గోపాల్ వర్మ  ఇప్పటి వరకు జీనియస్ డైరెక్టర్ నుంచి ఒక పిచ్చి పట్టిన సెలబ్రిటీ గా మారాడు. చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతు తన ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకున్నాడు. ఇక ట్విట్టర్ లో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ మరింత దిగ జారి పోయాడు. తన సినిమా కు ఏదో ఒక రకంగా వివాదం రాజేసి మీడియా లో హైలెట్ అయ్యేలా చేసుకుంటూ తన సినిమా ప్రమోట్ చేస్తూ ఉంటారు. తన డేంజరస్‌` మూవీ  చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వర్మ ఇటీవల ఆషురెడ్డి కాలు నాకి సంచలనం సృష్టించాడు.

ఇక ఆ ఇంటర్వ్యూ తర్వాత మరో ఇంటర్వ్యూ లో అయితే మరీ పచ్చి బూతులు తో సాగింది..సాయి దివ్య అనే  యాంకర్ తన ప్రశ్నలతో వర్మ ఉక్కిరి బిక్కిరి చేసింది. వేరే వారు అయితే వెంటనే   వెళ్లి పోయేవారు. కాని దానికి తగ్గట్టుగానే వర్మ కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానాలు ఇచ్చాడు. అసలు ఇలాంటి ఇంటర్వ్యూ కొద్దిగా ఫేమస్ అయిన వారు ఎవ్వరూ ఇవ్వరు. ఆ ఇంటర్వ్యూ చూసి జనాలకు మతి పోయింది.ప్రస్తుతం ఈ వీడియో యుట్యూబ్ లో సంచలనం రేపుతోంది.

ఎంత వల్గర్ గా ఉన్న వర్మను అభిమానించే వారు ఉన్నారు. కాని ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆయన మీద అందరికీ జుగుప్స కలుగుతుంది. తాజాగా ఆర్జీవి ఇంటర్వ్యూపై రైటర్ కం డైరెక్టర్ బివిఎస్ రవి వర్మను కొట్టి చంపాలనే అర్ధం వచ్చేలా విమర్శలు చేశాడు. వర్మను ఉద్దేశించి ఇదే ఇంటర్వ్యూ వందేళ్ల క్రితం తీస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు.. యాభై ఏళ్ల క్రితం వస్తే వెలి వేసేవారు. సమాజం బరితెగించడం వల్ల మీరు బతికిపోయారు అంటూ ఘాటుగా కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news