‘శ్రద్ధా వాకర్’ తరహా ఘోరం.. భార్యను చంపి 50 ముక్కలు చేసి..

-

దిల్లీలో ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్‌ ఘటన మరవకముందే ఝార్ఖండ్​ సాహిబ్​హంజ్​లో అలాంటి దారుణమే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన రెండో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా నరికి బయట పడేశాడు. మృతురాలిని రూబికా పహారియాగా(22) పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మృతురాలు రూబికా గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. డాగ్​ స్వ్కాడ్​తో గాలింపు చర్యలు చేపట్టగా.. రూబికా శరీరంలోని 18 భాగాలు పోలీసులకు లభించాయి. మిగతా శరీరభాగాల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు దిల్దార్​ అన్సారీ, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడికి అంతకుముందే వివాహం జరిగింది. రూబికాను రహస్యంగా రెండో వివాహం చేసుకుని వేరే ఇంట్లో కాపురం పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news