ఏపీలో ఏ ఒక్క ఉద్యోగి సంతోషంగా లేడు – సూర్యనారాయణ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పి.ఆర్.సి అమలు చేయడంలో శాస్త్రీయమైన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అపహాస్యం చేసిందని విమర్శించారు. ఉద్యోగుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను తాము నమ్ముతున్నామని, అయితే 20వ తేదీ వచ్చిన జీతాలు, పింఛన్లకు ఇంకా జమ చేస్తూనే ఉన్నారని, దీన్ని చూస్తుంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చెల్లింపులు చేయకుండా ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోందని తాము భావించాల్సి ఉంటుందని చెప్పారు. గత మూడున్నర ఏళ్లలో ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేరని సూర్యనారాయణ అన్నారు. వన్ మ్యాన్ షో చేసే అధికారి చేతిలో రాష్ట్ర భవిష్యత్తును ఉంచడం సరికాదని అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news