ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్ గా అర్జెంటీనా నిలిచింది. పెనాల్టీ షూట్ అవుట్ లో 4-2 తేడాతో ఫ్రాన్స్ పై అర్జెంటీనా ఘనవిజయం సాధించింది. 36 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ఛాంపియన్ గా అర్జెంటీనా నిలిచింది. అర్జెంటీనా మూడోసారి సకర్ వరల్డ్ కప్ గెలిచింది.
కాగా, వరల్డ్ కప్ చరిత్రలో అర్జెంటీనాకు ఇది మూడో టైటిల్. ఆ జట్టు గతంలో 1978, 1986లో ప్రపంచ విజేతగా నిలిచింది. ఇక వరల్డ్ కప్ గెలిచి కెరీరకు వీడ్కోలు పలకాలన్న మెస్సి కల ఘనంగా నెరవేరింది. ఈ టోర్నిలో విజేతగా నిలిచిన అర్జెంటీనాకు రూ.347 కోట్ల భారీ ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ ఫ్రాన్స్ రూ. 248 కోట్లు అందుకుంది.
ఇది ఇలా ఉండగా, ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో రెండోసారి హ్యాట్రిక్ నమోదయింది. ఫ్రాన్స్ స్టార్ ఫుడ్ బాలర్ ఎంబాపే, అర్జెంటీనాపై హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. 80వ, 81వ, 118 వ నిమిషాల్లో ఎంబాపే గోల్స్ కొట్టాడు. దాదాపు 56 ఏళ్ల క్రితం ఇంగ్లాండుకు చెందిన ఆటగాడు ఈ రికార్డు నమోదు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డు మళ్లీ రిపీట్ అయింది. ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ ఓడటం గమనార్హం.