మా రాష్ట్రాన్ని ఓ తాగుబోతు నడుపుతున్నారు. మద్యం తాగి పార్లమెంట్లో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు డ్రగ్స్ సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. అని శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మాట్లాడిన ఆమె.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆప్‌పై హర్సిమ్రత్ ఈ విమర్శలు చేసిన సమయంలో సభలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నవ్వులు చిందించారు.
“మా సీఎం ఉదయం 11 గంటలకే మద్యం మత్తులో పార్లమెంట్‌కు వచ్చి కూర్చునేవారు. ఆయన పక్కన కూర్చున్న సభ్యులు తమ సీటును మార్చాలని కోరేవారు. ఇప్పుడు ఆయన రాష్ట్రాన్నే నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రే ఇలా ఉంటే.. రాష్ట్రం పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘తాగి వాహనాలు నడపొద్దు’ అనే బోర్డులు మనకు రోడ్లపై కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు వారు ‘తాగి రాష్ట్రాన్నే నడిపిస్తున్నారు’.”
-హర్సిమ్రత్ కౌర్, శిరోమణి అకాలీదళ్ ఎంపీ