నేటి నుంచి కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ల పంపిణీ

-

తల్లీపిల్లల సంరక్షణకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌ పథకం విజయవంతంగా అమలవుతుండగా.. కొత్తగా ‘కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ల’ను రూపొందించింది. గర్భిణుల్లో రక్తహీనత అత్యధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో తొలి విడతగా వీటిని పంపిణీ చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నేటి నుంచి కిట్లు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.

కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెంలో పువ్వాడ అజయ్‌, ములుగులో సత్యవతి రాథోడ్‌, జయశంకర్‌ భూపాలపల్లిలో ఎర్రబెల్లి, వికారాబాద్‌లో సబితా ఇంద్రారెడ్డి, నాగర్‌కర్నూల్‌లో శ్రీనివాస్‌ గౌడ్‌, గద్వాలలో నిరంజన్‌రెడ్డి, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌లో బాల్క సుమన్‌ ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.

తొమ్మిది జిల్లాల్లో 1.25 లక్షల మంది గర్భిణులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున 2.5 లక్షల కిట్లు అందించనున్నారు. ఒక్కో కిట్‌కు రూ.1962 చొప్పున ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రోటీన్లు, మినరల్స్‌, విటమిన్లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం ఈ కిట్ల లక్ష్యం.

Read more RELATED
Recommended to you

Latest news