ప్రపంచం మెచ్చిన సినిమాలలో కాంతారా సినిమా కూడా ఒకటి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఏ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకి హీరోకు రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు ఇచ్చారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హీరో గానే కాకుండా దర్శకుడిగా కూడా చేసిన రిషబ్ శెట్టికి కేవలం రూ.4 కోట్లు మాత్రమే పారితోషకం ఇచ్చారట. కనీసం సూపర్ హిట్ అయ్యాక కూడా హోం భలే ప్రొడక్షన్స్ వారు రిషబ్ శెట్టి కి అదనంగా పారితోషకం ఇవ్వడం లేదా కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం వంటివి చేయలేదని వార్త వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
కిరిక్ పార్టీ ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రిషబ్ శెట్టి ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈసారి భూత కోలా కాన్సెప్ట్ తో కాంతారా సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నాడు. మొత్తానికైతే ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి త్వరలోనే తెలుగు హీరోలతో కూడా సినిమా చేయనున్నట్లు సమాచారం.