కొత్త సంవత్సరంలో అదిరిపోయే ఫీచర్స్‌తో రానున్న వాట్సప్..?

-

వాట్సవ్‌ ఇప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునే పనిలో ఉంది. పోటీల నుంచి తట్టుకోవడానికి తెగ అప్‌డేట్‌లు వదలుతుంది. రెండు నెలల వ్యవధిలోనే వాట్సప్‌లో చాలా కొత్త ఫీచర్స్‌ వచ్చాయి. ఇక కొత్త సంవత్సరం నుంచి ఇంకొన్ని ముఖ్యమైన ఫీచర్స్‌ రానున్నాయి.. అవేంటంటే..

షెడ్యూల్ మెసేజ్

ప్రస్తుతం వాట్సాప్ తన వినియోగదారులకు ఆటోమేటిక్ మెసేజ్ డిలీషన్ ఆప్షన్‌ను ఇస్తుంది. అయితే మెసేజ్ షెడ్యూలింగ్ కోసం ఇంకా ఆప్షన్ లేదు. మెసేజ్ షెడ్యూలింగ్ ఆప్షన్ నార్మల్‌ మెసేజ్‌లో ఉంటుంది.. ఇది కొన్నిసార్లు బాగా ఉపయోగపడుతుంది. వాట్సాప్‌ను తమ పని కోసం కూడా ఉపయోగిస్తూ, అవసరమైతే రాత్రిపూట ఎవరి ప్రైవసీలో జోక్యం చేసుకోకుండా తమ ఉద్యోగులకు ఉదయాన్నే నోటిఫికేషన్‌లు పంపాలనుకుంటున్నారు.

మెసేజ్ ఎడిట్ చేయడం..

ప్రస్తుతం వాట్సాప్‌లో మెసేజ్ డిలీట్ చేసే ఆప్షన్ తప్ప ఎడిట్ చేసే అవకాశం లేదు. త్వరలో ఈ ఫీచర్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం..

కాల్ రికార్డింగ్

ఇక ఇప్పటివరకూ.. వాట్సాప్‌లో కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ లేదు.. ఈ ఫీచర్ వస్తుందా అని చాలా మంది వాట్సాప్ వినియోగదారులు ఎదురుచూస్తూ ఉన్నారు. త్వరలో ఈ కోరిక కూడా తీరనుంది.. వాట్సాప్ తన ప్రత్యర్థులకు సవాలును ఇస్తూ, లాస్ట్ సీన్, ఆన్‌లైన్ ఫీచర్‌ల మాదిరిగానే కాల్ రికార్డింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసే ఆప్షన్‌ను కూడా అందించే అవకాశం ఇవ్వనుంది.

మెసేజ్ అన్‌సెండ్ చేయడం

ప్రస్తుతం వాట్సాప్‌లో పొరపాటున పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసే ఆప్షన్ మాత్రమే ఉంది. అయితే మెసేజ్ డిలీట్ చేసిన తర్వాత, తొలగించినట్లు తెలుస్తుంది. ఈ మధ్య ఈ ఆప్షన్‌ మీద తెగ మీమ్స్‌ వస్తున్నాయి.. అలా తొలగించినట్లు చూపించడం వల్ల పెద్ద తలనొప్పిగా ఉందని చాలామంది ఫీల్‌ అవుతున్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్‌ చేసి అన్‌సెండ్‌ కొడితే ఎదుటివ్యక్తికి ఏం తెలియదు.. అదే ఫీచర్ త్వరలో వాట్సాప్‌కు కూడా రానుంది.

వెనీషియన్ మోడ్

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్ మాదిరిగానే వాట్సాప్ కూడా తన వినియోగదారులకు మరో గొప్ప ఫీచర్‌ను అందుబాటులో ఉంచనుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు తాత్కాలిక చాట్ థ్రెడ్‌ను సృష్టించే అవకాశాన్ని ఇస్తుంది. ఇది చాట్ ముగిసిన వెంటనే ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. చాలా సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసుకునే వారికి ఈ ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news