మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఇందులో భాగంగానే విశాఖపట్నం వేదికగా భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఏర్పాట్లతో సభా ప్రాంగణం మొత్తం పసుపు మయంగా మారిపోయింది. అదేంటి టీ డీ పీ నిర్వహిస్తున్న సభలో పాల్గొంటున్నారా? ఏంటి? అనే డౌటు కలుగుతుంది అయితే ఆ డౌటే ఏమి అవసరం లేదు.. ముఖ్యంగా ఆయన ఏ పార్టీ కి మద్దతుగా నిర్వహించడంలేదు.. ఏ సభలోనూ మరియు పార్టీకి మద్దతుగానూ ప్రచారం నిర్వహించట్లేదు.
ఆయనే ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించనున్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో జనసేన పార్టీ పెట్టారు. ఆ పార్టీకి కూడా ఈమధ్య బాగానే రెస్పాన్స్ వస్తోంది. అలాంటి సమయంలో ఆయనకు పోటీగా ఇలా ఎన్నికల ప్రచారం చేయడం ఏంటి? ఇలా కొత్త పార్టీ పెట్టడం ఏంటి? అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే రామ్ చరణ్ ఏ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోంది రియల్ లైఫ్ లోనే కాదు రీల్ లైఫ్ లో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఆర్ సీ 15 సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ పాత్ర పోషిస్తుంది. అందులో ఒకటి రాజకీయ నేత పాత్ర అయితే మరొకటి ఎన్నికల అధికారి పాత్రలు సమాచారం.
సినిమాలో రామ్ చరణ్ సీఎం కూడా అవుతారంట. అయితే ఆ పార్టీ పేరు అభ్యుదయం పార్టీ.. గుర్తు ఏమో ట్రాక్టర్.. రంగేమో పసుపు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదే కాకుండా కొన్ని ఫోటోలలో చరణ్ సైకిల్ మీద కూడా కనిపిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే సినిమాలో టీ డీ పీ ని రిప్రెజెంట్ చేస్తూ.. ఆ పార్టీని ప్రమోట్ చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.