ఏపీలో గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన.. ఎప్పుడంటే..?

-

రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని విధానం రూపోందించాం. కొత్త పద్ధతుల్లో ఈ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు అవుతాయి అని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో భూ సమీకరణ అనేది ఒక భూ సేకరణ మోడల్ భూములు ఇచ్చిన రైతులు కూడా లాభపడాలి. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు మంజూరైంది. మౌలిక సదుపాయాలు, అభివృద్ది ప్రాజెక్టులు చేపడతాం. ప్రతీ నియోజకవర్గంలోనూ ఓ పారిశ్రామిక ఎకో సిస్టం రావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంతో సమానంగా ఏపీలో పరిశ్రమలు కూడా రావాలి.

గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలన్నది మా ప్రభుత్వ విధానం. గ్రీన్ హైడ్రోజన్ లాంటి కొత్త ఇంధనాల ఉత్పత్తి చేసేలా కొత్త విధానం ఉపకరిస్తుంది. వ్యవసాయం చేసుకునే రైతులు కూడా సౌర విద్యుత్ ఫలకాలు పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేసి విక్రయించొచ్చు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ సంస్థ ముందుకు వచ్చింది. ఈ నెల 29 తేదీన ఈ గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మొత్తం 84,700 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడితో ప్రాజెక్టు వస్తుంది. ఎన్టీపీసీతో పాటు ఏపీ జెన్కో కూడా సంయుక్తంగా ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉంటారు. రిలయన్స్ సంస్థ కూడా 65 వేల కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 2.5 లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు వస్తాయి. పబ్లిక్ పాలసీలన్నీ రాష్ట్ర భవిష్యత్ ను మార్చేలా ఉండాలి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులకు ఉంది అని చంద్రబబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news