వంగవీటి రంగా వర్ధంతి నేపథ్యంలో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న రంగ విగ్రహావిష్కరణలో వైసీపీ నేతలు పాల్గొనగా, ఈరోజు ఆయన వర్ధంతి నిర్వహించి తీరుతామని టిడిపి నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి టిడిపి మరియు వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
దీంతో గుడివాడలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు పోలీసులు. అటు వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నిన్న వైసీపీ నేతలు కలిసి గుడివాడలో రంగా విగ్రహం ఆవిష్కరించిన ఆయన కుమారుడు రాధా… తాజాగా విజయవాడలో టిడిపి మరియు జనసేన నేతలు కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా సమక్షంలో వైసిపిని బండబూతులు తిట్టారు టిడిపి నేతలు.