ఆదర్శ మాతృమూర్తి శ్రీమతి హీరా బెన్ మోదీ – పవన్‌ కళ్యాణ్‌

-

ఆదర్శ మాతృమూర్తి శ్రీమతి హీరా బెన్ మోదీ అని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మాతృమూర్తి శ్రీమతి హీరా బెన్ మోదీ గారికి స్వర్గగతులు ప్రాప్తించాలని ఆ భగవంతుడి ప్రార్ధిస్తున్నానని ట్వీట్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌. నిండు నూరేళ్ళపాటు నిష్కామయోగంతో సంపూర్ణ జీవితం చవి చూసిన శ్రీమతి హీరాబెన్ గొప్ప పుణ్యవతి అన్నారు.

విలక్షణమైన నాయకత్వపటిమ, నిండుగా మెండుగా దేశ భక్తి కలిగిన శ్రీ నరేంద్ర మోదీ వంటి కుమారునికి జన్మనిచ్చి సచ్ఛీలతతో పెంచి పెద్దచేసి భారత మాత సేవకు కుమారుణ్ని అందించి ఆమె వీరమాతగా నిలిచిపోయారు. ఆమెకు శత వసంతాలు నిండిన సందర్భంగా తన తల్లిని శ్రీ మోదీ గారు కలిసిన సందర్భంలో.. “బుద్ధితో పని చేయాలి.. శుద్ధిగా జీవించాలి” అని తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారని వెల్లడించారు.

తల్లి లేని లోటు తీర్చలేనిది.. ఎవరూ పూడ్చలేనిది. ఇటువంటి దుఃఖ సమయంలో శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, శ్రీ మోదీ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. శ్రీమతి హీరా బెన్ గారికి అంజలి ఘటిస్తూ..ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news