2023లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు 21 రోజులు సెలవులొచ్చాయ్..!!

-

ఈరోజుల్లో బ్యాంకులకు వెళ్లేవాళ్లు తక్కువే.. ఏ పని అయినా ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకుంటున్నాం.. కానీ కొన్ని ముఖ్యమైన లావాదేవీలకోసం..బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్‌ ఎక్కువగా చేసేవారు బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతీ ఏడాది సెలవుల వివరాలను ముందుగానే ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తుంది. 2023 సంవత్సరంలో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో ఆర్‌బీఐ వెల్లడించింది. మరి వచ్చే ఏడాది హైదరాబాద్ రీజియన్‌లో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏ రోజుల్లో బ్యాంకులకు హాలిడేస్‌ ఇచ్చారో ఓ లుక్కేద్దామా..

2023 బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ చూస్తే..

జనవరి 26- రిపబ్లిక్ డే,
ఫిబ్రవరి 18- మహాశివరాత్రి,
మార్చి 7- హోళీ,
మార్చి 22- గుడి పడ్వా, ఉగాది,
మార్చి 30- శ్రీరామనవమి,
ఏప్రిల్ 1- బ్యాంక్స్ ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ డే,
ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి,
ఏప్రిల్ 7- గుడ్ ఫ్రైడే,
ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు.
ఏప్రిల్ 22- రంజాన్,
మే 1- మే డే,
జూన్ 29- బక్రీద్,
జూలై 29- మొహర్రం,
ఆగస్ట్ 15- ఇండిపెండెన్స్ డే,
సెప్టెంబర్ 7- శ్రీకృష్ణ జన్మాష్టమి,
సెప్టెంబర్ 18- వినాయక చవితి,
సెప్టెంబర్ 28- ఈద్ ఏ మిలాద్,
అక్టోబర్ 2- మహాత్మా గాంధీ జయంతి,
అక్టోబర్ 24- దసరా,
నవంబర్ 27- కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి,
డిసెంబర్ 25- క్రిస్మస్ సందర్భంగా సెలవు.

బ్యాంకులకు మొత్తంగా 21 సెలవులు వచ్చాయి. ఈ సెలవులు కాకుండా సాధారణ సెలవులు ఉంటాయి. ప్రతీ ఆదివారం, ప్రతీ నెలలో రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు ఎలాగూ హాలిడేనే.. ఈ సెలవులు సాధారణంగా ప్రతీ నెలలో 6 లేదా 7 వస్తాయి. ఇవి కాకుండా పైన వివరించిన పబ్లిక్ హాలిడేస్ అదనం. బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్ లాంటి సేవలను వాడుకోవచ్చు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news