మతి పోగొట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ తో సత్తా చాటిన సందీప్ రెడ్డి.!

-

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే . ఇక దీని తర్వాత ఈ సినిమా ను బాలీవుడ్ లో కూడా తీసి సూపర్ హిట్ గా మలిచాడు. దీనితో సందీప్ తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ తో పాటు టోటల్ బాలీవుడ్  లో ఆసక్తి పెరిగింది. తన టేకింగ్ మరియు దర్శకత్వ ప్రతిభకు అందరూ సలాం కొడుతున్నారు.

ప్రస్తుతం సందీప్.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో యానిమల్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.న్యూ ఇయర్ కానుకగా యానిమల్ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పిల్లలు దడుసుకొనేల క్రూరంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రణబీర్ కపూర్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాడు. ఈ లుక్ చూస్తే సందీప్  రెడ్డి మరో ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామా క్రియేట్ కోసం చూస్తున్నాడని తెలుస్తోంది.

బాడీ మొత్తం రక్తంతో ఉండి, చంకలో గొడ్డలి పెట్టుకుని సిగరెట్ కాల్చుతూ రణబీర్ ఓ రేంజ్ లో ఉన్నాడు. ఈ సినిమా లుక్ చూసి అందరి మతులు పోయాయి. మరోసారి సందీప్ రెడ్డి వంగా ఫస్ట్ లుక్ తోనే తన చిత్రానికి ప్రచారం వచ్చేలా చేశాడు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేయనున్నారు. దీని తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు వంగా.

 

 

Read more RELATED
Recommended to you

Latest news