ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సినిమా స్టైల్ లో నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో రోడ్ షో, సభలకు అనుమతులు నిషేధిస్తూ, జగన్ సర్కార్ నిన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై నారా లోకేష్ తన స్టైల్ లో స్పందించారు.
మీ తాత రాజారెడ్డి రాజ్యాంగం, మీ ముత్తాత పనిచేసిన బ్రిటీషోళ్ల చట్టాలు అమలు చేస్తానంటే కుదరదు జగన్ రెడ్డీ అంటూ నిప్పులు చెరిగారు నారా లోకేష్. ఇది నీ ఫ్యాక్షన్ స్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం. అర్ధరాత్రి గుడ్డిగా ఓ చీకటి జీవో ఇచ్చేశావని ఆగ్రహించారు.
తెల్లారేసరికి ఆ జీవోలో నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డుపై షో చేశావు. నీ ప్రచార పిచ్చి ఓ అవ్వ ప్రాణాల మీదకొచ్చింది. నడవలేని అవ్వాతాతలని సభలకు తరలించడం నేరం కాదా? ఆ అవ్వ తీవ్రంగా గాయపడటానికి కారకుడైన నీపై మర్డర్ కేసు బుక్ చేయాలి. సభకి అనుమతి ఇచ్చినవారిని విచారించాలని చురకలు అంటించారు.