RRRకు మరో ఘనత.. బాఫ్టా నాన్-ఇంగ్లీష్‌ బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు

-

RRRకు అవార్డుల పంట పండుతోంది. పురస్కారాల వేటలో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్‌ అవార్డులకు ఎంపికైన ఈ సినిమా తాజాగా మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం కోసం కుస్తీ పడుతోంది. తాజాగా బాఫ్టా (బ్రిటీష్ అకాడ‌మీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ఆర్ట్స్‌) నాన్ ఇంగ్లీష్ కేట‌గిరీలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో చేరింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ట్విటర్ వేదికగా తెలిపారు.

బాఫ్టా లాంగ్‌లిస్టులో ఆర్ఆర్ఆర్‌కు చోటు ద‌క్క‌డం సంతోష‌క‌ర‌మ‌ని, ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు అని ఆ చిత్ర నిర్మాత‌లు ట్వీట్ చేశారు. బాఫ్టాలో తొలుత లాంగ్ లిస్టును ప్ర‌క‌టిస్తారు. ఆ త‌ర్వాత నామినేష‌న్ల‌ను, ఆ త‌ర్వాత ఓవ‌రాల్ విన్న‌ర్‌ను వెల్ల‌డిస్తారు. బాఫ్టా నామినేష‌న్ల‌ను జ‌న‌వ‌రి 19వ తేదీన ప్ర‌క‌టించ‌నున్నారు. ఇక అవార్డుల‌ను ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన ప్ర‌క‌టిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news