కేసీఆర్ గన్ అయితే.. ఉద్యోగులు బుల్లెట్లు అని MLC కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని.. ఎలాంటి గొడవలు జరగకుండా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని గమనిస్తున్నారు..ఉద్యోగ ఉపాధ్యాయుల వల్లే దేశం బాగుంది, వారి కష్టం వల్లే దేశం ముందుకు నడుస్తోందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం, మాతృ విముక్తి కోసం ఉద్యోగులు ఆ రోజు త్యాగాలు చేశారు.. తెలంగాణ ఉద్యోగులతో కేసిఆర్ కు ఉన్నది తల్లి పేగు బంధమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పారని కేసిఆర్ ను పొగిడారు. దేశంలో ఇస్తున్న అవార్డులు ఫస్ట్ మూడు అవార్డులు తెలంగాణకు వస్తున్నాయని…ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న ఉద్యోగుల కష్టం ఉందని వివరించారు. పీఆర్సీ లాంటి విషయాలు చెప్పుకోవాల్సిందేనని… ఇది మన కుటుంబ సమస్య అన్నారు MLC కవిత.