GET READY.. ఇవాళ సాయంత్రం 6.03కు “వాల్తేరు వీరయ్య” ట్రైలర్ విడుదల

-

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు లైన్ క్లియర్ అయింది. జగన్ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. ఆర్కే బీచ్ లో ఈ నెల 8వ తేదీన అంటే రేపు వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ నిర్వహణ చేసుకునేందుకు చిత్ర యూనిట్కు పోలీసులు అనుమతి ఇచ్చారు. అన్ని జాగ్రత్తలతో వేడుక నిర్వహిస్తామని చిత్ర యూనిట్ హామీ ఇవ్వడంతో బీచ్ లో కార్యక్రమం నిర్వహణకు ఏపీ పోలీసులు అంగీకరించారు.

తొలిత పోలీసులు అభ్యంతరం చెప్పడంతో విశాఖ ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్ లో నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా పోలీసులు కూడా అనుమతులు ఇవ్వడంతో.. ఆర్కే బీచ్ లోనే ఈవెంట్ జరగనుంది. ఇది ఇలా ఉండగా, ఈ సినిమా ట్రైలర్‌ ఇవాళ రిలీజ్‌ కానుంది. ఈ మేరకు చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది. ఈ మేరకు పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news